: తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ గా ఎంపీ కవిత


తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ గా ఎంపీ కల్వకుంట్ల కవిత బాధ్యతలు చేపట్టారు. హైదరాబాదు ఏవీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ... ఒకప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్ వేల సంఖ్యలో ఉండేవారని, ఇప్పుడు వారి సంఖ్య తగ్గిందని అన్నారు. అందుకు కారణాలు ఏవైనా, తెలంగాణలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కు పూర్వ వైభవం తెస్తానని ఉద్ఘాటించారు. ఏపీతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం ఏర్పాటుకు పోరాడామని కవిత వివరించారు. అందుకు గవర్నర్ నరసిింహన్ ఎంతో తోడ్పాటు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ సుకుమార్, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News