: మాస్టర్ ప్లాన్ వచ్చాక రాజధాని శంకుస్థాపన తేదీ ప్రకటన: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ వచ్చాక రాజధాని శంకుస్థాపన తేదీని ప్రకటిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కాగా, భూసేకరణ కోరిన వారికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, మిగతావారు ల్యాండ్ పూలింగ్ లో భూములివ్వొచ్చని చెప్పారు. గుంటూరు జిల్లా ఐనవోలులో రైతులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, రాజధానికి 82 శాతం భూములిచ్చిన ఐనవోలు గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు విడుదల చేసినట్టు నారాయణ తెలిపారు. అంతేకాకుండా టాప్-5 గ్రామాల అభివృద్ధికి రూ.25 లక్షల నిధులు ఇస్తున్నట్టు తెలిపారు.