: ఏపీకి కేంద్రం నిధులు, రాయితీలు ఇవ్వాలి: బాలయ్య
ఏపీకి నిధులు, రాయితీలు ఇవ్వాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్రాన్ని కోరారు. ఏపీ సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ లను కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనుకుంటున్నారా? అని మీడియా ప్రతినిధులు బాలయ్యను అడగ్గా, ప్రత్యేక హోదా లాభనష్టాలపై తనకు అవగాహన లేదని నవ్వుతూ స్పందించారు. కావలసిన నిధులు, రాయితీలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఆ పక్కనే ఉన్న కామినేని ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.