: న్యాయమే గెలిచింది... తీర్పు ఊహించిందే: హైకోర్టు తీర్పుపై అన్నా డీఎంకే ప్రకటన


అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించిన కర్ణాటక హైకోర్టు తీర్పుపై అన్నా డీఎంకే పార్టీ స్పందించింది. న్యాయమే గెలిచిందని, హైకోర్టు తీర్పు ఊహించిందేనని ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం అన్నా డీఎంకే అధికార ప్రకటనను విడుదల చేసింది. అక్రమాస్తుల కేసును విచారించిన పరప్పణ అగ్రహార ప్రత్యేక కోర్టు జయలలితతో పాటు మరో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు తీర్పును జయలలిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో తీర్పును పున:పరిశీలించి తుది తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించిన హైకోర్టు, జయలలితపై నమోదైన అన్ని అభియోగాలను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News