: 'మోస్ట్ వాంటెడ్' చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్టు
కొంతకాలంగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ ఇరానీ గ్యాంగ్ ను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా 3.2 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ పై ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 100కు పైగా కేసులు ఉన్నాయి. వారిలో అబుబాకర్ అనే నిందితుడిపై చాలా కేసులున్నాయి. ఈ గ్యాంగ్ మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉందని తెలిసింది.