: ఏపీ రాజధానిలో స్థలం కేటాయిస్తే కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం: బాలకృష్ణ


ఆంధ్రప్రదేశ్ లో కూడా బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రాజధానిలో 30 ఎకరాల స్థలం కేటాయిస్తే ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ బాలయ్య తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఏపీ సచివాలయంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ను ఆయన కలిశారు. ఈ సమావేశంలో హిందూపురం ఆసుపత్రి అభివృద్ధిపైనా వారు చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News