: దావూద్ ను భారత్ కు రప్పించి తీరుతాం: లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని తమ వద్ద సమాచారం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. దావూద్ కు సంబంధించి పాక్ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. దావూద్ ను పట్టుకోవడంలో పాక్ ప్రభుత్వం విఫలమవుతోందని ఈ మేరకు రాజ్ నాథ్ లోక్ సభలో ప్రకటన చేశారు. అయితే ఎలాగైనా దావూద్ ను భారత్ కు రప్పించి తీరుతామని స్పష్టం చేశారు.