: డీఎంకే నేతల ఇళ్ల వద్ద పెరిగిన భద్రత... పార్టీ ముఖ్యులతో సమాలోచనల్లో కరుణానిధి


అక్రమాస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పు తమిళనాట రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు నుంచి జయలలిత నిర్దోషిగా బయటపడటంతో ఆమె మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోగా, జయలలిత ప్రత్యర్థి కరుణానిధి మాత్రం డైలమాలో పడ్దారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిమిషాల వ్యవధిలో ఆయన డీఎంకే ముఖ్యులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరుణానిధి నివాసంలో పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఇదిలా ఉంటే, జయలలితకు ప్రతికూలంగా తీర్పు వచ్చే పక్షంలో ఆమె మద్దతుదారులను నియంత్రించేందుకు సిద్ధమైన పోలీసులు, తాజాగా డీఎంకే నేతల ఇళ్ల వద్ద బందోబస్తుకు తరలివెళ్లారు. డీఎంకేకు చెందిన నేతలందరి ఇళ్ల వద్ద క్షణాల్లో భద్రత పెరిగింది.

  • Loading...

More Telugu News