: మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న జయ


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి 'అమ్మ' జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో, ప్రత్యేక కోర్టు జయను దోషిగా తేల్చడమే కాకుండా... ఆమెకు శిక్షను కూడా ఖరారు చేసింది. ఈ క్రమంలో కొన్ని రోజులు బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో గడిపిన జయ... ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలో, చట్ట ప్రకారం ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో, ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి దూరమవడమే కాకుండా, ఎమ్మెల్యేగా కూడా అనర్హురాలయ్యారు. అయితే, తాజాగా నేడు కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా ప్రకటించడంతో... ఆమెకు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. నిర్దోషి అయిన ఆమె, మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో, రానున్న రోజుల్లో జయ మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. జయ తమిళనాడు సీఎం పదవిని కోల్పోయినప్పటికీ ఆమె సీటు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. తన విధేయుడైన పన్నీర్ సెల్వంను సీఎంగా జయ నియమించినప్పటికీ... ఆయన ఏనాడూ సీఎం ఛైర్ లో కూర్చోలేదు. జయ మీదున్న గౌరవంతో ఆయన ఆ సీటును ఖాళీగానే ఉంచారు.

  • Loading...

More Telugu News