: జయ కేసులో తీర్పుపై సుబ్రహ్మణ్య స్వామి దిగ్భ్రాంతి
అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీర్పు ప్రతిని అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ తీర్పుపై అప్పీల్ కు వెళతానని వెల్లడించారు. జయ తన ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారంటూ డీఎంకే నేత అన్బగణ్, అప్పటి జనత పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె ఆస్తులపై 18 ఏళ్లపాటు విచారణ జరిగింది.