: రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు... హాజరుకానున్న అలనాటి నటీమణులు


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఏడాది నంది నాటకోత్సవాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎంపీ మురళీమోహన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16నుంచి 30 వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రెండువేల మంది కళాకారులతో 88 నాటక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలనాటి నటీమణులు షావుకారు జానకి, కృష్ణకుమారి తదితరులు హాజరుకానున్నారు. కాగా ఉత్సవాల సమయంలోనే నంది నాటక పురస్కారాలను కూడా అందజేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News