: అక్రమాస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా తేల్చిన హైకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయను నిర్దోషిగా తేలుస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో, గతంలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. జయపై మోపిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పుతో జయ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది.