: చంద్రబాబు జిల్లాలో బైక్ రేసింగ్... స్వర్ణముఖి నది వంతెనపై నుంచి పడి యువకుడి దుర్మరణం


రయ్ మంటూ శబ్దం చేసే బైకులు... క్షణాల్లో వంద కిలోమీర్ల వేగం... రహదారులపై భీతిగొలిపే మోటార్ సైకిళ్లు... ఇదీ బైక్ రేసుల్లో యువకుల జోరు. మొన్నటిదాకా హైదరాబాదుకే పరిమితం. నిన్న నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని విజయవాడ, గుంటూరులకూ పాకింది. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకూ అంటుకుంది. జిల్లాలోని శ్రీకాళహస్తిలో కొంతకాలంగా బైక్ రేసులు జరుగుతున్నాయి. రయ్ మంటూ దూసుకెళ్లే బైకులతో అక్కడి జనం బెంబేలెత్తిపోెతున్నారు. చర్యలు తీసుకోండని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, స్పందన శూన్యం. గత రాత్రి పట్టణ శివారులోని స్వర్ణముఖి నదీ సమీపంలో యువకులు రేసు బైకులతో వెర్రెత్తిపోయారు. ఓ బైక్ అదుపు తప్పి స్వర్ణముఖి నది వంతెనపై నుంచి కిందపడింది. ఈ ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలు కాగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News