: అమెరికాపై ఆర్ఎస్ఎస్ ఆగ్రహం
గ్రీన్ పీస్, ఫోర్డ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలపై మోదీ సర్కారు చర్యలు తీసుకోవడాన్ని అమెరికా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. గ్రీన్ పీస్, ఫోర్డ్ ఫౌండేషన్ భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నాయంటూ కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో, అమెరికా తీరు పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మండిపడుతోంది. భారత సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించాలని సూచించింది. ఇతర దేశాల నిర్ణయాలను ప్రశ్నించడం ఏమైనా అమెరికా పాలసీనా? అని ప్రశ్నించింది. ఆ రెండు సంస్థలకు అమెరికా కొమ్ము కాయడాన్ని ఆర్ఎస్ఎస్ తప్పుబట్టింది. ఈ మేరకు తన పత్రిక 'ఆర్గనైజర్' సంపాదకీయంలో అమెరికా తీరును దుయ్యబట్టింది. స్వదేశంలో అలాంటి ఉల్లంఘనలను అమెరికా అనుమతిస్తుందా? అని కూడా అడిగింది.