: కొత్త ఇంటికి భూమి పూజ చేసిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాదులో కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. జూబ్లీహిల్స్ లోని పాత ఇంటి స్థానంలో కొత్త నివాసం నిర్మాణానికి సంబంధించి బాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి ఆదివారం ఉదయం భూమి పూజలో పాల్గొన్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు అద్దె ఇంటిలో ఉంటున్నారు. కుటుంబంలోకి కొత్తగా మనవడు రావడంతో, ఆ చిన్నారికి అనుగుణంగా పాత ఇంటిలో ఏర్పాట్లు లేకపోవడం, పార్టీ శ్రేణుల కోసం కూడా సరైన వసతులు లేకపోవడంతో నూతన నివాసం నిర్మించేందుకు బాబు నిర్ణయించడం తెలిసిందే.