: ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో అగ్నిప్రమాదం... తగలబడుతున్న కంప్యూటర్లు, ఫైళ్లు
హైదరాబాదులోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ భవంతి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో, కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం అక్కడ మంటలు ఎగసిపడుతుండడంతో, నష్టం భారీగానే ఉండొచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.