: పెళ్లికి ముందే సంతానం కావాలంటున్న పాప్ క్వీన్
పాప్ సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేసిన లేడీ గాగా పెళ్లికి ముందే సంతానం కావాలని కోరుకుంటోంది. ప్రస్తుతం ఆమె టేలర్ కిన్నీతో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గాగా, టేలర్ ల నిశ్చితార్థం జరిగింది. అయితే, పెళ్లి ఎప్పుడనేది నిర్ణయించుకోలేదు. వచ్చే ఏడాది ఆరంభం నాటికి వీరి పెళ్లి జరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది. అయితే, ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన లేడీ గాగా రూపురేఖల్లో కాస్తంత మార్పు కనిపించడాన్ని మీడియా కెమెరాలు గుర్తించాయి. బహుశా, ఆమె గర్భవతి అయివుండొచ్చని మీడియా భావిస్తోంది. అన్నట్టు... అమ్మడేమో అమ్మాయిలే పుట్టాలని కోరుకుంటోండగా, టేలర్ మాత్రం అబ్బాయిలు పుడితే బాగుండునని తలపోస్తున్నాడట.