: విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేసిన ప్రిన్సిపాల్
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ కళాశాల ప్రిన్సిపాల్ ఈవ్ టీజర్ అవతారమెత్తాడు. పాలిటెక్నిక్ కళాశాల మహిళా విద్యార్థినుల హాస్టల్ లో శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. నవాబ్ గంజ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎఫ్ఆర్ ఖాన్, స్టెనోగ్రాఫర్ సీకే ఉపాధ్యాయ్, మరో ముగ్గురు వ్యక్తులు ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డారు. దీంతో, విద్యార్థినులు శనివారం ఆందోళనకు దిగారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్ ను, ఇతరులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.