: మరో దీక్షకు సిద్ధమైన జగన్


వైకాపా అధినేత జగన్ జూన్ 5, 6 తేదీల్లో మరో దీక్షను చేపడుతున్నారు. ఈ దీక్షలో... చంద్రబాబు ఏడాది పాలనపై నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. గుంటూరు-విజయవాడ మధ్యే దీక్ష వేదిక ఉంటుందని వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే, జిల్లా నేతలతో చర్చించిన తర్వాత వేదికను ఖరారు చేస్తామని చెప్పారు. విజయోత్సవాలు జరుపుకునే అర్హత చంద్రబాబు సర్కారుకు లేదని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. అన్ని విషయాల్లో టీడీపీ సర్కారు విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News