: సినీ నిర్మాతల సిండికేట్ కు 'సినిమా' చూపిస్తాం... వారి ఆటలు సాగనివ్వం: న్యూస్ చానళ్లు


అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఎల్ఎల్ పి పేరుతో ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, సిండికేట్ గా ఏర్పడిన 11 మంది నిర్మాతలపై తెలుగు న్యూస్ చానళ్లు కన్నెర్రజేశాయి. చిన్న నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేయడమేకాక, మీడియా మీద కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్న వీరికి 'సినిమా' చూపిస్తామని హెచ్చరించాయి. నిర్మాతల మండలిలో కూడా పదవులు అనుభవిస్తున్న వీరు... ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని... తాము చెప్పిందే జరగాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అగ్ర నిర్మాతల మద్దతు తమకు ఉందని చెప్పుకుంటున్న వీరు... సినిమా ప్రకటనలు కేవలం రెండు చానళ్లకే ఇవ్వాలని... మిగిలిన చానళ్లకు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో తమదే తుది నిర్ణయం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వీరి చర్యల పట్ల కౌన్సిల్ కూడా మౌనంగా ఉండటంతో... సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సిండికేట్ పై ఇతర చానళ్లు ఫైర్ అయ్యాయి. కేవలం రెండు చానళ్లకే ప్రకటనలు ఇవ్వాలనుకునే నిర్మాతల కవరేజీని ఆపేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన 'ఢీ అంటే ఢీ' నిర్మాత ఏర్పాటు చేసిన ఆడియో ఫంక్షన్ ను చానళ్లు బహిష్కరించాయి. దీంతో, మొత్తం ప్రోగ్రామ్ ను నిర్మాత క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News