: నటి నీతూ అగర్వాల్ పై దాడి యత్నం
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న సినీ నటి నీతూ అగర్వాల్ పై దాడి యత్నం జరిగింది. సస్పెండైన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు ఆమెపై దాడికి యత్నించాడు. షరతులతో కూడిన బెయిల్ ప్రకారం, ప్రతి ఆదివారం ఆమె రుద్రవరం పీఎస్ లో సంతకం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఆమె రుద్రవరం పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టేందుకు వచ్చింది. అనంతరం హైదరాబాద్ కు కారులో తిరిగి వెళ్తుండగా, నంద్యాల సమీపంలో ఉన్న అయ్యలూరు మెట్ట సమీపంలో దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి సంబంధించి, సిరివెళ్ల పీఎస్ లో నాగరాజుపై నీతూ ఫిర్యాదు చేసింది. సబ్ జైలులో ఉన్నప్పుడు వీరి మధ్య జరిగిన లావాదేవీలే ఈ దాడికి కారణం కావచ్చని పోలీసులు చెబుతున్నారు. నీతూ సబ్ జైల్లో ఉన్నప్పుడు ఆమె బట్టలను కూడా నాగరాజు ఉతికేవాడని సమాచారం. గతంలో ఆర్టీసీ డ్రైవర్ గా ఉన్న నాగరాజు ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తూ, తమిళనాడు నుంచి కూలీలను బస్సులో తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలో, నాగరాజును సస్పెండ్ చేశారు.