: చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనార్దన్ అనే అడ్వొకేట్ కోర్టులో పిటిషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ లేకుంటే కేసీఆర్ గొర్రెలు కాసుకునేవాడని చంద్రబాబు వ్యాఖ్యానించారని... ఈ వ్యాఖ్యలు గొల్ల, కురుమ కులస్తులను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన మేజిస్ట్రేట్ చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని చైతన్యపురి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.