: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి


ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ ను కారు ఢీకొన్న ఘటనలో... ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దుర్మరణం పాలైన విద్యార్థులను సుమంత్ రెడ్డి, సతీష్ లుగా గుర్తించారు. ప్రమాదం జరగగానే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని జనగామలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి, కారు డ్రైవర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానికి సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News