: దంచికొట్టిన హెన్రికాస్... 163 పరుగులు చేసిన సన్ రైజర్స్


ఓపెనర్లిద్దరూ స్వల్ప స్కోరుకే వెనుదిరగగా, కొత్త కుర్రాడు మొయిసెస్ హెన్రికాస్ చెలరేగాడు. కేవలం 46 బంతుల్లో ఓ ఫోర్, ఐదు సిక్స్ లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డ అతడు 74 పరుగులు చేశాడు. స్టార్ ప్లేయర్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, ఇయాన్ మోర్గాన్ లు పెవిలియన్ కు క్యూ కట్టినా, హెన్రికాస్ మాత్రం సత్తా చాటాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ధావన్ (13), డేవిడ్ వార్నర్ (17)లు ఐదు ఓవర్లలోపే పెవిలియన్ చేరారు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన హెన్రికాస్ చివరి దాకా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి, అజేయంగా నిలిచాడు. ఇక 164 పరుగుల విజయలక్ష్యంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ను మరికాసేపట్లో ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News