: ముంబైలో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం... ఫైర్ సిబ్బందికి గాయాలు, ఒకరి గల్లంతు


ముంబైలోని కున్వాదేవి ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. అగ్ని ప్రమాదం సంభవించిన సదరు భవనంలో మంటలను ఆర్పుతున్న క్రమంలో భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో మంటలార్పుతున్న ఫైర్ సిబ్బందిలోని ఓ ఫైర్ మన్ గల్లంతు కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించిన ఫైర్ సిబ్బంది గల్లంతైన తమ సహచరుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News