: రేపు సాయంత్రం 4 గంటలకు చర్చలకు రండి...ఆర్టీసీ కార్మికులకు ఏపీ సర్కారు పిలుపు


తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఆర్టీసీ సమ్మె ఏపీలో రేపటితో ముగిసేలా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం మొదలైన సమ్మె కారణంగా జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెను అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ జనాన్ని నిలువునా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావులతో భేటీ అయిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమ్మెను విరమింపజేసే దిశగా వారు తీసుకున్న చర్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనువెంటనే వేతన సవరణపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీతో భేటీ కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను ఏపీ సర్కారు చర్చలకు పిలుస్తూ కొద్దిసేపటి క్రితం ప్రకటనను విడుదల చేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు చర్చలకు రావాలని కార్మిక సంఘాల నేతలను ఆహ్వానించింది. 27 శాతం ఫిట్ మెంట్ కు ఏపీ సర్కారు సుముఖంగా ఉన్న నేపథ్యంలో కార్మికులు కూడా సానుకూలంగానే స్పందించే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News