: కిక్2 ఆడియో రిలీజ్ వేడుక ప్రారంభం... క్యూ కడుతున్న టాలీవుడ్ ప్రముఖులు
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన కిక్2 చిత్రం ఆడియో విడుదల వేడుక కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని శిల్పకళావేదికలో అట్టహాసంగా ప్రారంభమైంది. గతంలో రవితేజ నటించిన 'కిక్' చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆధారంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన హిందీ చిత్రం కూడా బంపర్ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన మరో హీరో నందమూరి కల్యాణ్ రామ్ కిక్2 చిత్రానికి నిర్మాతగా మారాడు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇప్పటికే చిత్ర నిర్మాత కల్యాణ్ రామ్ శిల్పకళావేదికకు చేరుకున్నారు.