: బ్యాంకులనే పేదల వద్దకు తీసుకువచ్చాం: కోల్ కతాలో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి పశ్చిమబెంగాల్ లో అడుగుపెట్టారు. ఛత్తీస్ గఢ్ పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన కొద్దిసేపటి క్రితం కోల్ కతా చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలు సంక్షేమ పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బ్యాంకులను జాతీయం చేశాయని, తాము మాత్రం బ్యాంకులనే పేదట ముంగిట నిలబెట్టామని పేర్కొన్నారు. దేశంలో 80 నుంచి 90 శాతం మందికి పెన్షన్, బీమా సౌకర్యాలు లేవన్నారు. వాటిని దేశ ప్రజలందరికీ అందించేందుకే కొత్త పెన్షన్, ప్రమాద బీమా పథకాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సామాజిక భద్రతా కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మోదీ ప్రకటించారు.