: పారిశుద్ధ్యం... భారత్ కంటే పాకిస్థాన్ లోనే వేగం పుంజుకుంది!
మురికికూపంగా మారుతున్న దేశాన్ని శుద్ధ భారత్ గా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్’కు శ్రీకారం చుట్టారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టారు. రాజకీయ, క్రీడా, చలన చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. అయితే ఈ చర్యలన్నీ పొరుగు దేశం పాకిస్థాన్ లో జరుగుతున్న పారిశుద్ధ్య ప్రణాళికలతో పోల్చుకుంటే లేశమాత్రమేనట. అమెరికాకు చెందిన నార్త్ కరోలినా వర్సిటీకి చెందిన ‘వాటర్ ఇన్ స్టిట్యూట్’ వెల్లడించిన జాబితాలో పాక్ సగర్వంగా ఐదో స్థానంలో నిలిచిందట. ఇక ఈ జాబితాలో భారత్ స్థానం ఎంతో తెలుసా? పాక్ కు అత్యంత దిగువగా 92వ స్థానంలో భారత్ నిలిచింది.