: చైనా అప్పులు పెరిగిపోతున్నాయి... జీడీపీకి మూడింతలవుతున్నాయట!


ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనాది రెండో స్థానం. అయితే ఆ దేశ అప్పులు క్రమంగా పెరిగిపోతున్నాయట. అంతేకాక బలమైన ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచిన చైనా, అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆ దేశ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశం చేసిన అప్పులు ఆ దేశ జీడీపీకి 282 శాతానికి పెరిగిపోయాయని మెకిన్సే గ్లోబల్ ఇన్ స్టిట్యూట్ వెల్లడించింది. గతేడాది చివరి నాటికి చైనా అప్పులు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆర్థిక పరంగా ఇప్పటికైతే ఇబ్బందేమీ లేకున్నా, ప్రస్తుతమున్న వేగంతోనే అప్పులు పెరిగితే మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని బ్యాంకింగ్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News