: వీఐపీలు జైలు శిక్ష తప్పించుకోగలరు అనడానికి సల్మాన్ ఘటనే ఉదాహరణ!: కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు
వీఐపీలు జైలు శిక్షను కూడా తప్పించుకోగలరనడానికి సల్మాన్ ఖాన్ ఘటనే ఉదాహరణ అని బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరం చేసినా జైలుకు వెళ్లకుండా తప్పించుకోగలరన్న విషయాన్ని సల్మాన్ కేసు రుజువు చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్థారించి, ఐదేళ్ల కారాగార శిక్షను ముంబై సెషన్స్ కోర్టు ఖరారు చేయగా, దానిని నిలుపుదల చేస్తూ బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.