: గంభీర్ సేనను బెయిలీ అడ్డుకుంటాడా?
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా జార్జ్ బెయిలీ ఆధ్వర్యంలోని 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్'తో గంభీర్ కెప్టెన్సీలోని 'కోల్ కతా నైట్ రైడర్స్' తలపడనుంది. అయితే, ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్ జట్టు పేలవ ఆటతీరుతో టోర్నీ నుంచి ఇక నిష్క్రమించడమే తరువాయి. కానీ, ఈ సీజన్లో నాకౌట్ చేరే జట్ల స్థానాలను మాత్రం పంజాబ్ ప్రభావితం చేయగలదు. ఈ నేపథ్యంలో పంజాబ్ తో పోరును కోల్ కతా తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. 13 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న కోల్ కతా ఈ మ్యాచ్ లో నెగ్గితే నాకౌట్ పోరుకు చేరినట్టే భావించవచ్చు. కాగా, ఫాంలో ఉన్న గంభీర్ సేనను బెయిలీ జట్టు అడ్డుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది. టాస్ గెలిచిన బెయిలీ...బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది.