: ఎప్పటికైనా యోగా టీచర్ గా మారతా: నిత్యామీనన్
యోగా టీచర్ నుంచి స్టార్ హీరోయిన్ గా అనుష్క మారితే, హీరోయిన్ నుంచి యోగా టీచర్ గా తాను మారతానని నటి నిత్యామీనన్ తెలిపింది. ఎప్పటికైనా యోగా టీచర్ కావాలన్నది తన కోరికని చెప్పింది. మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేసే హీరోయిన్ గా నిత్యామీనన్ కు పేరుంది. అనుష్కతో కలిసి 'రుద్రమదేవి' సినిమాలో నటించిన నిత్యా మీనన్, ఆ సినిమా విశేషాలను వివరిస్తూ, తాను అనుష్క కంటే ఏడు అంగుళాలే తక్కువ హైట్ అని చెప్పింది. అనుష్క కంటే పొట్టిగా ఉండడం వల్ల ఓ పాటలో నటించేటప్పుడు బాగా ఎత్తున్న హై హీల్స్ వేసుకోవాల్సి వచ్చిందని, ఈ సందర్భంగా తన కాలు కూడా బెణికిందని గుర్తు చేసుకుంది. అనుష్కకు, తనకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని, ఆధ్యాత్మికం, యోగా ఇలా చాలా అంశాల్లో తమ మధ్య పోలికలు ఉన్నట్టు నిత్య వెల్లడించింది.