: చంద్రబాబు, కేసీఆర్ లకు వైఎస్ జగన్ లేఖ...ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని డిమాండ్
వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ, తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు లేఖ రాశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి తక్షణమే సమ్మెను విరమింపజేయాలని ఆయన కొద్దిసేపటి క్రితం రాసిన లేఖలో ఇద్దరు సీఎంలను కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరు సీఎంలు ఆర్టీసీ కార్మికులతో ఉమ్మడిగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఆయన ఆ లేఖలో కోరారు.