: గజ్వేల్ ను ఆల్ట్రాసిటీగా చేస్తా: కేసీఆర్ హామీ


మెదక్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని షాదీఖానా, ఆడిటోరియం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గజ్వేల్ ను ఆల్ట్రాసిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గజ్వేల్ కు ఔటర్ రింగ్ రోడ్డు రావల్సి ఉందని, 24 గంటల మంచినీటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఇక్కడే నివసించాలని అనిపించేలా తన నియోజకవర్గాన్ని రెండు మూడేళ్లలో ఎంతో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News