: చర్చలకు ఎవరు పిలిచినా వెళతాం: ఈయూ, టీఎంయూ నేతలు
నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ మేరకు సమ్మె నోటీసులు జారీ చేసిన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల నేతలు కొద్దిసేపటి క్రితం విస్పష్ట ప్రకటన చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, సమ్మె విరమణ దిశగా చర్చలకు ఎవరు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఈయూ నేత పద్మాకర్ ప్రకటించారు. చర్చలకు వెళ్లేదిలేదని తాము ఎన్నడూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. అయితే తదుపరి జరిగే ఏ స్థాయి భేటిలోనైనా సామరస్యపూర్వకంగా చర్చలు సాగాలని ఆయన అన్నారు. టీఎంయూ నేతలు కూడా ఇదే తరహాలో ప్రకటన విడుదల చేశారు.