: అతనో బాధ్యతలేని నేత: రాహుల్ పై రక్షణ మంత్రి ఫైర్


అమేధీలోని మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్టు రద్దుపై లోక్ సభలో మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డ ఒక రోజు తరువాత, రాహుల్ పై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ బాధ్యతలేని వ్యక్తి అని, ఆయనకు కేవలం ప్రచారం మాత్రమే కావాలని విమర్శించారు. పబ్లిసిటీ కోసం ఆయన ఏ పనైనా చేస్తారని, వాస్తవానికి అమేధీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదన్న వాస్తవాన్ని రాహుల్ విస్మరించి, కావాలనే తప్పుడు విమర్శలు చేశారని ఆరోపించారు. రాహుల్ ఏదైనా కంపెనీనీ ఫుడ్ పార్క్ ఏర్పాటు నిమిత్తం ఆహ్వానిస్తే, తామంతా సహకరిస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కోర్వా ప్రాంతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పేరిట రూ. 218 కోట్లు ఖర్చుచేసి కూడా నేటి వరకూ ఉత్పత్తిని ప్రారంభించలేదని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయం కారణంగానే ఫుడ్ పార్క్ మూతపడిందని తెలిపారు.

  • Loading...

More Telugu News