: ఉప్పల్ స్టేడియం సీజ్ చేయాలని అధికారుల నిర్ణయం
హైదరాబాదులోని ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని సీజ్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. 2002 నుంచి ఈ స్టేడియానికి ఆస్తిపన్ను కింద చెల్లించాల్సిన రూ.12.5 కోట్లను ఐఏఎల్ఏ ఎగవేస్తూ వచ్చింది. పలుమార్లు అధికారులు నోటీసులు పంపినా పట్టించుకోలేదు. అందుకే స్టేడియాన్ని సీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్ ఉప్పల్ మైదానానికి చేరుకుని అధికారులతో చర్చిస్తున్నారు. కాగా సోమవారం ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది.