: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చంద్రబాబు సమీక్ష
నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, రహదారి రవాణా సంఘం ఎండీ సాంబశివరావు ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం 27 శాతం ఫిట్ మెంట్ ఇస్తామన్నప్పటికీ కార్మికులు సమ్మె విరమించకపోవడం, 43 శాతం ఫిట్ మెంట్ కే కార్మికులు పట్టుబట్టడం, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం వంటి విషయాలపై చర్చిస్తున్నారు. సమ్మె విరమింపజేసేందుకు నిన్న(శుక్రవారం) సాంబశివరావు చేసిన చర్చలు విఫలమయ్యాయి.