: ఖాన్ కాబట్టే సల్మాన్ కు బెయిల్ వచ్చింది: ఎంపీ సాధ్వీ ప్రాచీ
ఎప్పుడూ ఏవో ఒక వ్యాఖ్యలు చేస్తూ వివాదం సృష్టిస్తుంటారు బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచీ. ఈసారి నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ముస్లిం అవడంవల్లే 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ కు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. "సల్మాన్ ఖాన్ ముస్లిం కాకుంటే, నిరుపేద బాధితులకు న్యాయం జరిగి ఉండేది" అని ఆమె పేర్కొన్నారు.