: మోహన్ బాబు దగ్గర బౌన్సర్ గా పని చేసేవాడు ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడు: రేవంత్ రెడ్డి
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సికింద్రాబాదులో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ, తలసాని స్థాయికి మించిన విమర్శలు చేసి పార్టీలో పలుకుబడి పెంచుకుందామని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. టీడీపీలోకి రాకముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ నటుడు మోహన్ బాబు సినిమా షూటింగుల దగ్గర బౌన్సర్ గా పని చేసేవాడని తెలిపారు. అలాంటి తలసాని ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పోటీ చేయాలని సవాళ్లు విసురుతున్నాడని ఎద్దేవా చేశారు. చేతనైతే గెలిపించిన పార్టీకి రాజీనామా చేసి, ఆ తరువాత ఎంత గొప్పనేతో నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు. తలసాని అనుభవిస్తున్న ప్రస్తుత హోదా వెనుక టీడీపీ పెట్టుబడి, రక్తం, శ్రమ వున్నాయని, తలసానికి సిగ్గూశరం ఉంటే తక్షణం టీడీపీకి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.