: జయలలిత అప్పీలుపై ఈ నెల 11న తీర్పు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పెట్టుకున్న అప్పీలుపై కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించేందుకు తేదీ నిర్ణయించింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు తీర్పు వెలువరించనున్నట్టు హైకోర్టు వెబ్ సైట్ లో పేర్కొంది. రూ.66.65 కోట్ల అవినీతి కేసులో గతేడాది సెప్టెంబర్ లో ట్రయల్ కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దాంతో తీర్పును రద్దు చేయాలని ఆమె పైకోర్టుకు వెళ్లారు. ఇదే సమయంలో ఈ కేసులో జయ తరపున వాదించేందుకు తమిళనాడు ప్రభుత్వం నియమించిన న్యాయవాదిని ఇటీవల సుప్రీంకోర్టు తప్పించింది. ఆ స్థానంలో సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యను కర్ణాటక నియమించింది.