: టీటీడీకి విరాళంగా స్కార్పియో వాహనం
తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఎప్పుడూ ఏవో కానుకలను విరాళంగా ఇస్తూనే ఉంటారు. ఇటీవల టీటీడీకి ప్రముఖ పారిశ్రామిక వేత్త శివనాడార్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. తాజాగా చెన్నైకి చెందిన మోతేష్ కుమార్ అనే భక్తుడు స్కార్పియో వాహనాన్ని విరాళంగా అందజేశాడు. రూ.14.5 లక్షల విలువైన ఆ వాహనాన్ని శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు భక్తుడు మోతేష్ అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం అధికారులు వాహనాన్ని స్వీకరించారు.