: రండి... మాతృభూమి రుణం తీర్చుకోండి: ఎన్నారైలలో ఉత్తేజం నింపిన లోకేష్


"నేను ఇక్కడికి మిమ్మల్ని డబ్బులు అడగటానికి రాలేదు. మన తాతలు, తండ్రులు పడ్డ కష్టాలు మన పిల్లలు, మనవలు పడకూడదన్న ఉద్దేశంతో వచ్చాను. ఎంత సంపాదించామన్న విషయాన్ని పక్కన పెట్టి వాటితో ఏం చేశామన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఏం చేయాలో మీకే తెలుస్తుంది. కుగ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయండి" అంటూ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చేసిన ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని లోకేష్ వివరించారు. హైదరాబాద్ కట్టడానికి నిజాం పాలకులకు 300 ఏళ్లు, సికింద్రాబాద్ కట్టడానికి బ్రిటీషు వారికి 150 సంవత్సరాలు పడితే, చంద్రబాబు తొమ్మిదేళ్లలో సైబరాబాద్ కట్టారని ఆహూతుల హర్షధ్వానాల మధ్య గుర్తు చేశారు. స్మార్ట్ విలేజ్ కన్నా ముందు స్మార్ట్ వార్డ్ పై దృష్టిని పెట్టాలని ఆయన కోరారు. ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోకుండా, నలుగురు లేదా పది మంది కలిసి ముందడుగు వేయాలని సూచించారు. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు మాతృభూమి రుణం తీర్చుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News