: గడ్కరీ కావాలా?, జీఎస్టీ బిల్లు అమలు కావాలా?: మోదీ ముందు కాంగ్రెస్ ఫైనల్ ఆఫర్


జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాలంటే, రవాణా మంత్రి నితిన్ గడ్కరీని పదవి నుంచి తొలగించాల్సిందేనని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆయనను తొలగించిన తరువాతనే బిల్లు ఆమోదం గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాయి. మోదీ సర్కారు అత్యంత కీలకమని భావిస్తున్న జీఎస్టీ బిల్లు ఇప్పటికే లోక్ సభలో అమోదం పొందగా, రాజ్యసభలో మాత్రం అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు అనుమతి పొందాలన్న ఉద్దేశంతో ఎన్డీయే సర్కారు పార్లమెంట్ సమావేశాలను పొడిగించిన సంగతి తెలిసిందే. నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలోని 'పుర్తి గ్రూప్' ఓ ప్రభుత్వ సంస్థ నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైందని కాగ్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో, విపక్షాలు నిన్న రాజ్యసభను అడ్డుకున్నాయి. గడ్కరీ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో నిన్న రాజ్యసభ ఆరు సార్లు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News