: కూలిన జెట్ విమానం, బతికిన పైలెట్... పనులు చేసుకుంటున్న ఇద్దరి దుర్మరణం


అది మిగ్ 27 మోడల్ విమానం. ఇప్పటికే ఎన్నో మిగ్ 27 విమానాలు ప్రమాదాలకు గురై పదుల సంఖ్యలో వాయుసేన ఉద్యోగుల ప్రాణాలు తీశాయి. అయితే, ఇది మరో రకం ప్రమాదం. పశ్చిమ బెంగాల్ లోని తంతిపుర ప్రాంతంలో ఓ మిగ్ విమానం కూలగా, పైలెట్ తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. అయితే, భూమిపై పనులు చేసుకుంటున్న వారిపై ఆ విమానం పడడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మిగ్ కూలిపోతోందని గమనించిన పైలెట్ సమిరన్, ఎజక్ట్ బటన్ నొక్కి ప్రాణాలను కాపాడుకున్నాడని అధికారులు తెలిపారు. హసిమారా ఎయిర్ బేస్ నుంచి ఉదయం 8:20కి బయలుదేరిన విమానం 8:30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని వివరించారు.

  • Loading...

More Telugu News