: చరిత్ర సృష్టించిన బ్రిటన్ ఎన్నారైలు


బ్రిటన్‌ ఎన్నికల్లో ప్రవాస భారతీయులు కొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా పదిమంది భారతీయ సంతతి అభ్యర్థులు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన కీలక నేత, ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ కు సన్నిహితురాలిగా గుర్తింపున్న ప్రీతి పటేల్‌ మరోసారి విట్‌ హమ్‌ నుంచి గెలుపొందారు. ఇదే సమయంలో లేబర్‌ పార్టీ తరఫున చాలాకాలంగా విజయం సాధిస్తూ వస్తున్న కీత్‌ వాజ్‌, వీరేంద్ర శర్మలు మరోసారి తమ సత్తా చాటారు. వీరితో పాటు ఈ ఎన్నికల్లో వాలెరీ వాజ్‌, సీమా మల్హోత్రా, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌, లిసా నంది, అలోక్‌ శర్మ, శైలేశ్‌ వర్మ, సువెలా ఫెర్నాండెజ్‌ లు గెలుపొందిన భారత సంతతి ఎన్నారైలుగా నిలిచారు. మొత్తం 57 మంది భారతీయ సంతతి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. అయితే, సంవత్సరాల తరబడి లేబర్‌ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయులు, ఈ దఫా కన్జర్వేటివ్‌ పార్టీకి ఓట్లేసినట్టు ఫలితాల సరళి తెలుపుతోంది.

  • Loading...

More Telugu News