: ఇకపై కత్రినాకు అదే పని!
అన్నీ కుదిరితే, బాలీవుడ్ కపుల్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ల నిశ్చితార్థం ఈ నెలలో జరిపేందుకు రెండు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో రణబీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. "నా వరకూ నేను ఒకరికి కమిట్ అయిపోయాను. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. ఆ వేడుక ఎప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేను కానీ, ఎప్పుడు వివాహం అయినా సరే, ముగ్గురు పిల్లలకు తండ్రిని అవ్వాలని అనుకుంటున్నా" అన్నాడు. దీంతో కత్రినా ఇక సినిమాలు ఏం చేస్తుంది? వరుసగా పిల్లల్ని కనే పనిలో బిజీగా ఉంటుందని బాలీవుడ్ జనాలు, అభిమానులు జోకులు పేల్చేపనిలో పడ్డారు. కాగా, ఈ నెలాఖరులో కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో రణబీర్, కత్రినాల నిశ్చితార్థం జరగనున్నట్టు తెలుస్తోంది.