: చేజార్చుకున్న చెన్నై!


వరుసగా ఐదో విజయం సాధించడంతో పాటు, రెండేళ్ల తరువాత చెపాక్ స్టేడియంలో సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముంబై ఇండియన్స్ ఓడించింది. 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా, 84 పరుగులు చేసినప్పటికీ, ఆ తరువాత తడబడింది. చివర్లో రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన సమయంలో ముంబై అభిమానుల టెన్షన్ ను పటాపంచలు చేస్తూ, అంతగా పేరులేని హార్థిక్ పాండ్య అద్భుతాన్ని చూపిస్తూ, కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేసి, మరో 4 బంతులు మిగిలివుండగానే, జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో చెన్నై జట్టు మ్యాచ్ ని చేజార్చుకున్నట్లయింది. ప్రస్తుత ఐపీఎల్ పోరులో ముంబైకి ఇది వరుసగా ఐదో విజయం.

  • Loading...

More Telugu News