: ఫిట్ మెంట్ సమ్మెకు కూడా ఆంధ్రా, తెలంగాణ రంగుపులిమారు: ఆర్టీసీ ఎండీ


ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఫిట్ మెంట్ సమ్మెకు ఆంధ్ర, తెలంగాణ రంగుపులుముతున్నారని కార్మిక సంఘాల నేతలపై ఎండీ సాంబశివరావు మండిపడ్డారు. కార్మికులతో చర్చలు విఫలమయ్యాయని మీడియాకు చెప్పిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు అనవసర విషయాలు చర్చకు తెస్తున్నారని, వేతన సవరణ గురించి తప్ప మిగిలిన విషయాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ గురించి తానేం మాట్లాడతానని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రకటించిన 27 శాతం ఫిట్ మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినదని, తెలంగాణ ప్రభుత్వం ఏదీ చెప్పకుండా తానెలా హామీ ఇస్తానని ఆయన వారిని ప్రశ్నించారు. తానేం చేయాలో కార్మికులు నిర్ణయించవద్దని, తనకు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News